v hanumantha rao: నాలుగేళ్లు గుర్తుకు రాని ఏడు మండలాలు.. ఇప్పుడెందుకు గుర్తొచ్చాయి?: వీహెచ్

  • ఆ మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న టీఆర్ఎస్  
  • విభజన హామీల గురించి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు?
  • బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందా, లేదా? తేలిపోతుంది

తెలంగాణకు అత్యంత కీలకమైన ఏడు మండలాను ఏపీలో కలపడం దారుణమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఈరోజు లోక్ సభలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కలసి ఈ పని చేశారని... అందుకే మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ క్షమించరని చెప్పారు. ఆ ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు అమెండ్ మెంట్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా వినోద్ ఈ మేరకు స్పందించారు.

వినోద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సెటైర్లు వేశారు. నాలుగేళ్లుగా గుర్తుకు రాని ఏడు మండలాలు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయని వీహెచ్ ప్రశ్నించారు. విభజన హామీల గురించి ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వం ప్రాజెక్టుకు నిధులు ఎందుకు అడగలేదని విమర్శించారు. బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందా? లేదా? అనే విషయం తేలిపోతుందని అన్నారు. 

More Telugu News