TRS: రికార్డ్ టైమ్ లో అసెంబ్లీ, సెక్రటేరియట్ ను కట్టిన చంద్రబాబు.. హైకోర్టు కోసం బిల్డింగ్ మాత్రం కట్టడం లేదు: లోక్ సభలో టీఆర్ఎస్ విమర్శ

  • కావాలనే హైకోర్టు భవనాన్ని చంద్రబాబు నిర్మించడం లేదు
  •  హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలి
  • ట్రైబల్ యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలను నిర్మించాలి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలనే హైకోర్టును నిర్మించడం లేదని లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ విమర్శించారు. అమరావతిలో రికార్డు టైమ్ లో అసెంబ్లీ, సెక్రటేరియట్ ను నిర్మించారని... కానీ, సొంత హైకోర్టు కోసం ఒక భవనాన్ని మాత్రం నిర్మించడం లేదని విమర్శించారు. ఉమ్మడి హైకోర్టులో తమ ప్రాంతానికి చెందిన జడ్జిలు తక్కువగా ఉండటం బాధాకరమని చెప్పారు. హైకోర్టు విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హామీ ఇచ్చిందని... కానీ ఆ హామీలు అమలుకాలేదని అన్నారు. హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీకి సెంట్రల్ యూనివర్శిటీని మంజూరు చేశారని... తెలంగాణకు ట్రైబల్ వర్శిటీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని... కానీ, ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదని వినోద్ చెప్పారు. యూనివర్శిటీ ఏర్పాటు కోసం కావాల్సినంత స్థలం ఉన్నప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి కూడా హామీ ఇచ్చారని... కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. 

More Telugu News