galla jayadev: గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం.. రికార్డుల నుంచి తొలగించాలంటూ డిమాండ్

  • రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందన్న గల్లా
  • లోక్ సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిందన్న జితేందర్ రెడ్డి
  • కాంగ్రెస్, బీజేపీలను ఒప్పించి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించారంటూ లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, లోక్ సభ, రాజ్యసభలలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని... ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తాము ఒప్పించామని... తదనంతరం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు పాస్ అయిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఎలా అంటారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు.

More Telugu News