sumanth ashwin: 'హ్యాపీ వెడ్డింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చరణ్

  • లక్ష్మణ్ కార్య దర్శకుడిగా 'హ్యాపీ వెడ్డింగ్'
  • ముచ్చటైన జంటగా సుమంత్ అశ్విన్ .. నిహారిక
  • అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పెరుగుతోన్న ఆసక్తి  

సుమంత్ అశ్విన్ .. నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో 'హ్యాపీ వెడ్డింగ్' సినిమా రూపొందింది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ హాజరుకానున్నాడు.

యూవీ క్రియేషన్స్ వారు .. పాకెట్ సినిమా వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తితో వున్నారు. ఆహ్లాదకరమైన కథా నేపథ్యంలో సాగే ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడనున్నామని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో .. ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

More Telugu News