sunita: నేను చెబితేనే నమ్మండి.. పెళ్లి విషయంపై సింగర్ సునీత

  • వరుసగా ఫోన్ కాల్స్ .. మెసేజ్ లు వస్తున్నాయి 
  • మళ్లీ పెళ్లటగదా? అని అడుగుతున్నారు 
  • అలాంటి నిర్ణయం తీసుకుంటే నేనే చెబుతాను    

యాంకర్ గా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. గాయనిగా సునీత తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. సుదీర్ఘమైన తన కెరియర్లో మంచి పేరును సంపాదించుకున్నారు. చాలాకాలం క్రితమే పెళ్లి చేసుకున్న సునీత .. ఇద్దరు పిల్లల తరువాత భర్త నుంచి విడిపోయారు. అప్పటి నుంచి కెరియర్ పై .. పిల్లల ఆలనాపాలనపై దృష్టిపెట్టిన ఆమె, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టుగా జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ విషయంపై ఆమె తన స్పందనను తెలియజేస్తూ ఒక వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. "నాకు వరుసగా ఫోన్ కాల్స్ ..మెసేజ్ లు వస్తున్నాయి. 'మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారటగదా?' అని అడుగుతున్నారు. 'అవునా .. ఎవరిని?' అని నేను ఆశ్చర్యంగా అడిగితే .. 'ఐటీ ప్రొఫెషనల్ తో అట గదా?' అంటున్నారు. చాలా వెబ్ సైట్స్ ఈ విషయాన్ని గురించి రాసుకొచ్చాయి .. నా మీద ఇంత ఎఫెక్షన్ ఉందా అనిపించింది.

నిజం చెప్పాలంటే, మళ్లీ పెళ్లి అనే ఆలోచనే నాకు లేదు. నేను ఒక మాట అంటే అది వేరే విధంగా జనంలోకి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇది నా పర్సనల్ విషయం కనుక .. భవిష్యత్తులో కూడా నేను చెబితేనే అది నిజమని భావించాలి. అప్పటి వరకూ వచ్చే పుకార్లను నమ్మవద్దు" అని స్పష్టం చేశారు.


    

More Telugu News