Lok Sabha: అసలింతకీ నో-కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏమిటి?

  • అవిశ్వాస తీర్మానాన్ని ఎవరైనా ప్రవేశ పెట్టొచ్చు
  • స్పీకర్ అంగీకరించాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరం
  • చర్చకు వస్తే ప్రభుత్వం మద్దతు నిరూపించుకోవాల్సిందే

ప్రస్తుతం దేశ్యాప్తంగా ‘నో-కాన్ఫిడెన్స్ మోషన్’ (అవిశ్వాస తీర్మానం) పై చర్చ జరుగుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని  ప్రవేశపెట్టింది. స్పీకర్ దీనిని అనుమతించి శుక్రవారం చర్చకు అనుమతించారు. ఇక అప్పటి నుంచి రాజకీయ పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. దేశ ప్రజల మొత్తం దృష్టి ఇప్పుడు పార్లమెంటువైపు మళ్లింది. మరి ఇంతలా చర్చకు కారణమైన అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? ఎందుకు ప్రవేశపెడతారు?

లోక్‌సభ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే లోక్‌సభలో అధికార పార్టీకి పూర్తి మద్దతు ఉండాలి. అంటే.. ప్రభుత్వం కొనసాగాలంటే ఉండాల్సిన మద్దతు ఉండి తీరాలి. అయితే, ప్రభుత్వానికి అంత మద్దతు లేదనుకున్నప్పుడు సభ్యుడు ఎవరైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే తప్పనిసరిగా 50 మంది సభ్యులు అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. కావాల్సినంత మంది మద్దతు ఉన్నట్టయితే, అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అంగీకరించి చర్చకు అనుమతిస్తారు. దీంతో ప్రభుత్వం లోక్‌సభలో తన మద్దతు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా నిరూపించుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే ఆ ప్రభుత్వం కుప్పకూలుతుంది.

More Telugu News