రూ. 16 లక్షల టిప్ ఇచ్చిన ఆటగాడు... వెయిటర్లు ఫుల్ హ్యాపీ!

20-07-2018 Fri 10:47
  • ప్రస్తుతం గ్రీస్ లో సేదదీరుతున్న రొనాల్డో
  • స్నేహితులతో రెస్టారెంట్ కు వెళ్లిన ఫుట్ బాలర్
  • వెయిటర్ల సర్వీస్ కు ఫిదా అయ్యి భారీ టిప్
ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తింటే, వెయిటర్ కు అతను చేసిన సేవను బట్టి ఎంతో కొంత టిప్ ఇవ్వడం ప్రతి చోటా కనిపించేదే. ఇక ప్రముఖ పోర్చుగల్ ఫుట్ బాల్ ఆటగాడు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న క్రిస్టియానో రొనాల్డో, ఓ హోటల్ సిబ్బంది చేసిన అతిథి మర్యాదలకు ఫిదా అయ్యి ఏకంగా రూ. 16 లక్షలు టిప్ ఇచ్చాడు.

ఉరుగ్వేపై ఓటమితో ప్రపంచకప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన తరవాత, ప్రస్తుతం గ్రీస్ లో సేదదీరుతున్న రొనాల్డ్, తన సన్నిహితులతో కలసి ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ వారి సర్వీస్ నచ్చడంతో భారీగా టిప్ ఇచ్చాడు. ఇంత భారీ టిప్ ను చూసి రెస్టారెంట్ సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు లోనుకాగా, రొనాల్డో టిప్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది.