Srisailam: శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద!

  • తుంగభద్ర, నారాయణపూర్ జలాశయాల గేట్లు ఎత్తివేత
  • ఆల్మట్టి సహా నిండుకుండలా కృష్ణానది ఎగువ ప్రాజెక్టులు
  • వచ్చే నీరంతా ఇక శ్రీశైలం, సాగర్ లకే

కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో తుంగభద్ర, నారాయణపూర్ జలాశయం అన్ని గేట్లు, జూరాల 17 గేట్లను ఎత్తివేయగా, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీరు ఈ సాయంత్రానికి శ్రీశైలం చేరనుంది.

తుంగభద్ర నుంచి 70 వేల క్యూసెక్కులకు పైగా, నారాయణపూర్ నుంచి లక్షన్నర క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 29.13 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మొత్తం 215 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టు నిండాలంటే, 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద దాదాపు వారం రోజుల పాటు కొనసాగాల్సివుంటుంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తూ ఉండటం, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలు పూర్తిగా నిండటంతో వచ్చే నీరంతా తొలుత శ్రీశైలం, ఆపై నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు రానుంది.

More Telugu News