Dollar: ఆల్ టైమ్ రికార్డు కనిష్ఠానికి రూపాయి విలువ!

  • కరెక్షన్ దిశగా సాగుతున్న భారత మార్కెట్లు
  • డాలర్ తో మారకపు విలువ రూ. 69.12కు పతనం
  • గత కనిష్ఠాలను దాటి మరింత దిగజారిన రూపాయి

భారత స్టాక్ మార్కెట్లు మరింత కరెక్షన్ దిశగా సాగుతాయని విశ్లేషకులు వేస్తున్న అంచనాలతో రూపాయి విలువ ఈ ఉదయం రికార్డు స్థాయికి పడిపోయింది. డాలర్ తో రూపాయి మారకపు విలువలో జీవనకాల కనిష్ఠం రూ. 69.09 కాగా, ఇప్పుడు దాన్ని దాటి రూ. 69.13 వరకూ పడిపోయింది. రూపాయి విలువ మరింతగా పతనం కాకుండా రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగాలని ట్రేడర్లు కోరుతున్నారు.

ఆసియాలోని అన్ని దేశాల కరెన్సీలూ డాలర్ తో పోలిస్తే బలహీనంగానే కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం కొంత పాజిటివ్ గానే సాగుతున్నాయి. నేడు లోక్ సభలో జరిగే అవిశ్వాస చర్చ తరువాత ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏమాత్రం ఉండదని స్పష్టం కావడంతో, గత రెండు రోజులుగా స్తబ్ధుగా ఉన్న ఇన్వెస్టర్లు నేడు నూతన కొనుగోళ్లకు దిగారు. సెన్సెక్స్ 133 పాయింట్లకుపైగా, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.

More Telugu News