BCCI: బీసీసీఐలో ‘సెక్స్ ఫర్ సెలక్షన్’ ప్రకంపనలు.. రాజీవ్ శుక్లా సహాయకుడిపై వేటు

  • జట్టులో చోటు కోసం అమ్మాయిలను పంపమన్న రాజీవ్ శుక్లా సహాయకుడు
  • వెలుగుచూసిన ఆడియో టేపు
  • సెలక్షన్ కమిటీలో ప్రకంపనలు

బీసీసీఐలో ‘సెక్స్ ఫర్ సెలక్షన్’ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ చేసిన ఆరోపణలు సెలక్షన్ కమిటీని కుదిపేస్తున్నాయి. జట్టులో చోటు కావాలంటే ఫైవ్ స్టార్ హోటల్‌కు అమ్మాయిలను పంపాల్సిందేనని ఐపీఎల్‌ చైర్మన్ రాజీవ్‌ శుక్లా వ్యక్తిగత సహాయకుడు అక్రమ్‌ సైఫీ తనను కోరారని రాహుల్ శర్మ ఆరోపించాడు. తాను ‘సెక్స్ ఫర్ సెలక్షన్’ బాధితుడినని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను ఓ చానల్ ప్రసారం చేసింది. మరికొందరు ఆటగాళ్లు కూడా అక్రమ్‌పై ఆరోపణలు చేశారు.

ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ)లో అక్రమ్‌కు ఎలాంటి పదవి లేకపోయినా ఆటగాళ్ల ఎంపికలో చక్రం తిప్పుతున్నాడని పలువురు ఆటగాళ్లు ఆరోపించారు. ఫైవ్ స్టార్ హోటల్‌కు అమ్మాయిని పంపిస్తే జట్టులో నీ పేరు ఉంటుందని అక్రమ్ హామీ ఇవ్వడం ఆడియో టేపులో స్పష్టంగా వినిపిస్తోంది. ఆటగాళ్లు తనపై చేసిన ఆరోపణలను అక్రమ్ ఖండించాడు. రాహుల్ శర్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బీసీసీఐ అక్రమ్‌ను సస్పెండ్ చేసింది. ఆరోపణలపై యాంటీ కరప్షన్ యూనిట్ విచారణకు ఆదేశించింది.

More Telugu News