kcr: ఓ సాధువును గూండాలా ట్రీట్ చేస్తారా?: టీ-సర్కార్ పై సుబ్రహ్మణ్య స్వామి మండిపాటు

  • స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ తగదు
  • గూండాల బహిష్కరణకున్న చట్టాన్ని ఆయనపైనా?  
  • నగర బహిష్కరణ ఉత్తర్వులను తక్షణం ఎత్తివేయాలి

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన విషయమై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. గూండాలను బహిష్కరించేందుకు ఉన్న చట్టాన్ని పరిపూర్ణానందపై ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. చట్టాన్ని పోలీసులు సరిగా అర్థం చేసుకోలేదా? అని ప్రశ్నించిన సుబ్రహ్మణ్య స్వామి, పరిపూర్ణానందపై విధించిన బహిష్కరణ ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని కోరారు.

 ఓ సాధువును గూండాలా ట్రీట్ చేస్తారా? పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడమంటే ఆయన్ని తీవ్రంగా అవమానించడమేనని, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగిందని మండిపడ్డారు. నగర బహిష్కరణ కారణంగా పరిపూర్ణానంద హక్కులకు భంగం కలిగిందని, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆ లేఖలో విమర్శించారు.

More Telugu News