Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ లో 30 టీవీ ఛానళ్లపై నిషేధం

  • పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఛానళ్లపై నిషేధం
  • కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ
  • జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసిన రాష్ట్ర హోంశాఖ

మలేషియాలో తలదాచుకున్న వివాదాస్పద ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ కు చెందిన పీస్ టీవీ, పాకిస్థాన్ కు చెందిన జియో టీవీలతో సహా 30 ఛానళ్లపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఈ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించింది. కేంద్ర ప్రసార శాఖతో చర్చించిన అనంతరం జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎంఎన్ వోహ్రా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు దీనికి సంబంధించి రాష్ట్ర హోంశాఖ లేఖలు రాసింది. ఈ ఛానళ్లు హింసను ప్రేరేపించేలా ప్రసారాలు చేస్తున్నాయని... దీంతో, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని లేఖలో పేర్కొంది.

More Telugu News