Newyork: న్యూయార్క్ లో విహరిస్తున్న రేణుదేశాయ్!

  • వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న రేణూదేశాయ్ ఫ్యామిలీ
  • ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోలు 
  • నేను 5.8 అడుగులు..అకీరా నా కన్నా పొడుగు: రేణూ

ప్రముఖ నటి రేణూదేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యతో కలిసి వెకేషన్స్ నిమిత్తం న్యూయార్క్ లో సరదాగా గడుపుతోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. తాము  ఏ రంగు దుస్తులైతే ధరించామో అదే రంగు టోపీలు, షూలను ధరించామని రేణూ దేశాయ్ పేర్కొంది. ‘నేను 5.8 అడుగులు. అకీరా నా కన్నా పొడుగు.. 14 ఏళ్ల వయసులోనే 6.3 అడుగులు ఉన్నాడు..’ అని ఆ పోస్ట్ లో చెప్పింది. మరో ఫొటోలో ఆద్య తన కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉంది. ‘ఆద్య, ఆమె న్యూయార్క్ ఫ్రెండ్ పాబ్లో’ అని పోస్ట్ చేసింది. 

More Telugu News