diwakar reddy: విప్ ధిక్కరిస్తే జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తప్పవు: బుద్ధా వెంకన్న

  • దివాకర్ రెడ్డి పార్లమెంటుకు హాజరుకావాలి
  • విజయసాయిరెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరింది
  • చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు సరికాదు

కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు టీడీపీ విప్ జారీ చేసింది. అయితే, విప్ జారీ చేసినా తాను పార్లమెంటు సమావేశాలకు వెళ్లబోనని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, జేసీ దివాకర్ రెడ్డి అవిశ్వాసంపై చర్చకు హాజరుకావాలని... విప్ ను ధిక్కరిస్తే జేసీపై చర్యలు తప్పవని చెప్పారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పట్టిన పిచ్చి పరాకాష్టకు చేరుకుందని అన్నారు. ఆయను జగన్ వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అన్నారు. అవిశ్వాసంపై చర్చ కోసం దేశమంతా ఎదురు చూస్తోందని చెప్పారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా అన్నాడీఎంకే తదితర పార్టీలపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.

More Telugu News