vijay devarakonda: 'గీత గోవిందం' నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • విజయ్ దేవరకొండ .. రష్మికల 'గీత గోవిందం'
  • ఆసక్తిని రేకెత్తిస్తోన్న పోస్టర్స్ 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల    

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం' సినిమా రూపొందింది. విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ ఆదివారం అంటే 22వ తేదీన ఉదయం 11 గంటల 5 నిమిషాలకి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇంతవరకూ పోస్టర్స్ ద్వారా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కథానాయిక బరువు బాధ్యతలు తనవే అనే ఉద్దేశాన్ని ఈ పోస్టర్స్ ద్వారా కథానాయకుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ట్విట్టర్ ద్వారా కూడా బరువు బాధ్యతలను గురించి విజయ్ దేవరకొండ ప్రస్తావిస్తూ ఉండటం విశేషం. టీజర్ తో అంచనాలు పెంచడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. యూత్ లో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి వస్తోన్న మరో ప్రేమకథా చిత్రం కావడంతో, కుర్రకారంతా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తోంది.    

More Telugu News