Pawan Kalyan: సొంత టీవీ ఛానల్ ఏర్పాటు చేసుకోబోతున్న పవన్ కల్యాణ్!

  • '99 న్యూస్' చానెల్ ను టేకోవర్ చేస్తున్న పవన్ కల్యాణ్
  • ఈ ఛానల్ ను ప్రారంభించింది సీపీఐ
  • మైక్ ను పట్టుకుని 'ఇదేనా మన ఛానల్' అన్న పవన్

జనసేన పార్టీకి సొంత టీవీ ఛానల్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న '99 న్యూస్' ఛానల్ ను ఆయన టేకోవర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సీపీఐ పార్టీ ఈ ఛానల్ ను ప్రారంభించింది. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా ఆ ఛానల్ కు చెందిన మైక్ ను పవన్ పరిశీలించారు. ఇదేనా మన ఛానల్ అని ప్రశ్నించారు. సమాజానికి మేలు చేసేందుకు, అవినీతిని ఎండగట్టేందుకు ఈ ఛానల్ మనకు ఉపయోగపడుతుందని ఆయన అన్నట్టు సమాచారం.

More Telugu News