karthikeya: 15 కోట్లు కొల్లగొట్టిన 'ఆర్ ఎక్స్ 100'!

  • భారీ ఓపెనింగ్స్ తో మొదలు
  • నాలుగు రోజుల్లో 10 కోట్ల గ్రాస్
  • ఒక్క తెలంగాణలోనే 3 కోట్ల షేర్

యూత్ కి నచ్చితే .. మాస్ ఆడియన్స్ మెచ్చితే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుందనే విషయాన్ని 'ఆర్ ఎక్స్ 100' మరోసారి నిరూపించింది. ప్రేమకి యాక్షన్ .. ఎమోషన్ కలిస్తే అది ఏ స్థాయిలో పండుతుందనేదానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలిచింది. తొలి రోజున భారీ ఓపెనింగ్స్ తో థియేటర్స్ దగ్గర మొదలైన సందడి .. ఆరు రోజులు పూర్తయినా అలాగే కొనసాగుతోంది.

కేవలం రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా, తొలి నాలుగు రోజులలోనే 10 కోట్ల గ్రాస్ ను రాబట్టేసింది. 6 వ రోజు పూర్తయ్యేనాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 15 కోట్లకి చేరుకున్నాయి. ఒక్క తెలంగాణలోనే ఈ సినిమా 3 కోట్ల షేర్ ను రాబట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే సమయంలో థియేటర్స్ కి వచ్చిన 'విజేత ' .. చినబాబు' .. 'ఆర్ ఎక్స్ 100' స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా వసూళ్ల పరంగా ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశమని చెప్పాలి.      

More Telugu News