Grater Noida: నాలుగు రోజుల క్రితమే భవనంలోకి.. అంతలోనే కుప్పకూలిన బిల్డింగ్.. కుటుంబం ఆచూకీ గల్లంతు!

  • శనివారం రాత్రి కుప్పకూలిన భవనం
  • ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు వెలికితీత
  • కనిపించని త్రివేదీ కుటుంబం ఆచూకీ

గ్రేటర్ నోయిడాలోని శబేరి గ్రామంలో మంగళవారం రాత్రి  కుప్పకూలిన భవనం వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భవనం కూలడానికి ముందే అందులోకి ఓ కుటుంబం వచ్చింది. ఇప్పుడు వారి ఆచూకీ కనిపించకపోవడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలాల నుంచి ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీశారు. శనివారం రాత్రే కుటుంబం ఆ భవనంలోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. 24 ఏళ్ల శివకుమార్ త్రివేది, అతడి తల్లి, కోడలు, మేనకోడలు భవనంలోకి వచ్చారు. త్రివేదీది ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి.

కొత్తగా నిర్మిస్తున్నఆ భవనంలోని నాలుగో అంతస్తులో త్రివేదీ కుటుంబం ఉండేదని పోలీసులు వివరించారు. భవనం కూలిన తర్వాత నుంచి వారి ఆచూకీ లేదని, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. నేటితో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని మీరట్ జోన్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.

ఎంబీఏ పూర్తి చేసిన త్రివేదీ నోయిడాలోని ఓ కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్‌ అని, తాజాగా కూలిన భవనం నిర్మాణ పనుల కోసం ఏప్రిల్‌లోనే ఒప్పందం పూర్తి చేసుకున్నారని తెలిపారు. జూలై 14న భవనంలోకి వచ్చినట్టు పోలీసులు వివరించారు. అంతలోనే భవనం కూలిందని పేర్కొన్నారు.

More Telugu News