Telangana: తెలంగాణ మల్టీప్లెక్స్ లలోనూ బయటి ఫుడ్ కు అనుమతి: సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కారు!

  • సినిమా చూడాలంటే రూ. 2 వేలు సరిపోని పరిస్థితి
  • వాపోతున్న మధ్యతరగతి కుటుంబాలు
  • ఆగస్టు 1 నుంచి అమలులోకి

మల్టీ ప్లెక్స్ కు వెళ్లిన ఓ కుటుంబం సినిమా చూసి బయటకు రావాలంటే రూ. 2 వేలు చాలని పరిస్థితి. ఓ మధ్య తరగతి కుటుంబం మల్టీ ప్లెక్స్ వైపు చూడాలంటేనే భయపడాల్సిన దుస్థితి. పాప్ కార్న్ కావాలంటే 200, కూల్ డ్రింక్ కావాలంటే రూ. 80. కనీసం మంచినీళ్లు తాగుదామంటే రూ. 50 పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో బయటి ఫుడ్ తీసుకెళ్లేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి.

మల్టీ ప్లెక్స్ లలో తినుబండారాల ధరలపై బాంబే హైకోర్టులో విచారణ జరుగుతుండగానే, ఆ రాష్ట్ర సర్కారు ఇదే నిర్ణయాన్ని తీసుకుని, అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా అదే విధమైన నిర్ణయాన్ని వెలువరించడం గమనార్హం. దీనిపై మల్టీ ప్లెక్స్ ల యాజమాన్యాలు స్పందించాల్సివుంది.

More Telugu News