Kiran rijuju: బాప్‌రే! దేశంలో ఇన్ని రేప్‌లా.. స్వయంగా కేంద్రమే చెప్పింది!

  • దేశంలో అడ్డూఅదుపు లేకుండా పోతున్న అత్యాచారాలు
  • మూడేళ్లలో లక్షకుపైగా కేసులు
  • కఠిన చర్యల కోసం బిల్లు సిద్ధం చేస్తున్నట్టు చెప్పిన మంత్రి

దేశంలో అత్యాచారాలకు అంతూపొంతూ లేకుండా పోతోందని స్వయంగా కేంద్రమే వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు సమాధానం ఇస్తూ దేశ్యాప్తంగా 2014-16 మధ్య ఏకంగా 1,10,333 అత్యాచార కేసులు నమోదైనట్లు సభకు తెలిపారు. 2014లో 36,375 కేసులు, 2015లో 34,561 కేసులు, 2016లో 38,947 కేసులు నమోదైనట్లు వివరించారు.

ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి మాట్లాడుతూ, నిందితులను కఠినంగా శిక్షించనున్నట్టు తెలిపారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు. 12 ఏళ్లు, ఆ లోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిపారు. ప్రతిపాదిత బిల్లు త్వరలోనే లోక్‌సభ ముందుకు రానున్నట్టు వివరించారు.  

More Telugu News