prakash javdekar: విద్యాహక్కు చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మళ్లీ డిటెన్షన్ విధానం!

  • విద్యాహక్కు చట్ట సవరణ బిల్లుకు సభ గ్రీన్ సిగ్నల్
  • మళ్లీ అమల్లోకి డిటెన్షన్
  • పాసైతేనే పై తరగతులకు

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే విద్యాహక్కు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదంతో ఇప్పటి వరకు ఉన్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దు కానుంది. అయితే, ఈ విధానాన్ని రద్దు చేయాలా? కొనసాగించాలా? అనేది ఆయా రాష్ట్రాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

ఇప్పటివరకు విద్యాహక్కు చట్టం కింద 8వ తరగతి వరకు విద్యార్థులను డిటైన్ చేయడానికి వీల్లేదు. ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా వారిని పై తరగతికి పంపించాల్సిందే. అయితే, విద్యాహక్కు చట్టంలో తాజా సవరణతో ఇప్పుడా అవకాశం ఉండదు. డిటెన్షన్ విధానం తిరిగి అమల్లోకి రానుండడంతో విద్యార్థులు పాసైతేనే పై తరగతికి వెళ్తారు. అయితే, 5, 8 తరగతుల విద్యార్థులకు మాత్రం ఈ విషయంలో మరో అవకాశం ఇస్తారు.

More Telugu News