Venkaiah Naidu: రాజ్యసభలో 10 భాషల్లో మాట్లాడి అదరగొట్టిన వెంకయ్య!

  • ఇప్పటి వరకు 17 భాషలకు మాత్రమే అనుమతి
  • మరో ఐదింటిని చేర్చిన ప్రభుత్వం
  • 22కి చేరిన భాషల సంఖ్య

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన ఎం.వెంకయ్యనాయుడు రాజ్యసభలో అదరగొట్టారు. సభలో ఇప్పటి వరకు 17 భాషల్లో మాత్రమే మాట్లాడేందుకు అనుమతి ఉండగా, ఇప్పుడు మరో ఐదు భాషలు చేర్చారు. దీంతో వాటి సంఖ్య మొత్తం 22కు పెరిగింది. బుధవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సభ్యులు ఏయే భాషల్లో మాట్లాడవచ్చో వెంకయ్య వివరించారు.

డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాలి, సింధి భాషలను కొత్తగా చేర్చినట్టు చెప్పిన వెంకయ్య.. బంగ్లా, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠి, నేపాలి, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగులో మాట్లాడి పెంచిన భాషల గురించి వివరించారు. సభ్యులు తాము ఏ భాషలో మాట్లాడాలనుకుంటున్నదీ తొలుత సెక్రటేరియట్‌లో సమాచారం ఇస్తే అనువాదకుడుని ఏర్పాటు చేస్తారు.

More Telugu News