balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో రకుల్!

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్
  • ముఖ్య పాత్రల్లో రానా .. ప్రకాశ్ రాజ్
  • రకుల్ చేసేది ప్రత్యేక గీతం కాదు  

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, బసవతారకం పాత్రను విద్యాబాలన్ చేస్తోంది. ప్రకాశ్ రాజ్ .. రానా .. సీనియర్ నరేశ్ తదితరులు ముఖ్యమైన పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమా కోసం రకుల్ ను ఎంపిక చేయనున్నారనీ .. ఒక ప్రత్యేక గీతంలో ఆమె కనిపించనుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

రకుల్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. అయితే ఆమెను ప్రత్యేక గీతం కోసం తీసుకున్నారడంలో నిజం లేదు. సీనియర్ హీరోయిన్ 'శ్రీదేవి' పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ .. శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో నటించారు .. వాటిలో ఎన్నో సూపర్ హిట్స్ వున్నాయి. అందువలన ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర ప్రస్తావన కూడా వస్తుంది. ఈ పాత్ర కోసం రకుల్ ను సంప్రదించడం .. ఎంతమాత్రం ఆలోచించకుండా ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు.      

More Telugu News