gvl: జీవీఎల్ కు సవాల్ విసిరిన ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

  • ఏపీకి జీవీఎల్ శిఖండిలా తయారయ్యారు
  • ‘అగ్రిగోల్డ్’ వ్యవహారంపై కన్నాకు అవగాహన లేదు
  • సాగర మాల ప్రాజెక్టు కింద కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా?

సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి జీవీఎల్ శిఖండిలా తయారయ్యారని విమర్శించారు. సాగర మాల ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అని జీవీఎల్ కు ఆయన సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పైనా ఆయన మండిపడ్డారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై అవగాహన లేకుండా కన్నా మాట్లాడుతున్నారని, అసలు, నాడు ‘కాంగ్రెస్ హయాంలో కన్నా మంత్రిగా ఉన్నప్పుడే అగ్రిగోల్డ్’ ఏర్పాటు చేశారని, దాని పురోగతికి సాయం చేశారని, అప్పట్లో తాను సెబీకి ఫిర్యాదు చేశానని కుటుంబరావు చెప్పుకొచ్చారు. చంద్రబాబును విమర్శించే నిమిత్తం వైసీపీ నేతలు జగన్, విజయసాయిరెడ్డి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని, సరైన భాషలో మాట్లాడాలని హితవు పలికారు.

More Telugu News