samanta: రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్న సమంత మూవీ

  • శివకార్తికేయన్ హీరోగా 'సీమరాజా'
  • కథానాయికగా సమంత 
  • మరో తమిళ మూవీగా 'సూపర్ డీలక్స్'

ప్రస్తుతం తమిళంలో సమంత రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి 'సీమరాజా' కాగా .. మరొకటి 'సూపర్ డీలక్స్'. ఈ రెండు సినిమాల్లో 'సీమరాజా' ముందుగా ప్రేక్షకులను పలకరించనుంది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా సమంత నటిస్తుండగా, మరో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.

ఈ సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ పాత్ర తనకి మరింత మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో సమంత వుంది. 'వినాయకచవితి' సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు కొంతసేపటి క్రితం ప్రకటించారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇక తమిళంలో సమంత చేస్తోన్న మరో సినిమా 'సూపర్ డీలక్స్'ను అక్టోబర్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ ఏడాది అంతా కూడా సమంత సందడి చేయనుందన్న మాట.    

More Telugu News