hebba patel: 'బిగ్ బాస్ 2' విషయంలో హెబ్బా పటేల్ క్లారిటీ ఇచ్చేసింది

  • నేను మా ఇంట్లోనే వున్నాను 
  • మరే ఇంట్లోను లేను 
  • ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు 

'బిగ్ బాస్ 2' షో కూడా బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఎలిమినేషన్స్ కారణంగా శని .. ఆదివారాల్లోని ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. 'బిగ్ బాస్ హౌస్' లో సందడి .. గ్లామర్ తగ్గినట్టుగా అనిపిస్తే, ఆ లోటును భర్తీ చేయడానికి కొంత క్రేజ్ వున్న నాయికలను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రంగంలోకి దింపుతుంటారు.

అలా త్వరలో 'బిగ్ బాస్ హౌస్' లోకి హెబ్బా పటేల్ ఎంట్రీ ఇవ్వనుందనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ వార్త నిజమేననుకున్న వాళ్లంతా ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి హెబ్బా పటేల్ స్పందించింది. "నేను మా ఇంట్లోనే వున్నా .. మరే ఇంట్లో లేను .. ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇలా 'బిగ్ బాస్ హౌస్'లోకి తాను ఎంట్రీ ఇస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసింది. 

More Telugu News