no confidence motion: ఫలించిన టీడీపీ ప్రయత్నం.. అవిశ్వాసంపై లోక్ సభలో ఎల్లుండే చర్చ!

  • లోక్ సభలో శుక్రవారం నాడు అవిశ్వాసంపై చర్చ
  • ప్రశ్నోత్తరాలు కూడా రద్దు.. సాయంత్రం వరకు చర్చ
  • విభజన చట్టంపై రాజ్యసభలో సోమవారం చర్చ

టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. అవిశ్వాసంపై చర్చకు సిద్ధమైంది. శుక్రవారం నాడు లోక్ సభలో అవిశ్వాసంపై చర్చను చేపట్టనున్నట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఎల్లుండి ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసి, సాయంత్రం వరకు అవిశ్వాసంపై చర్చ జరపనున్నట్టు వెల్లడించింది.

చర్చ సందర్భంగా ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలనే విషయాన్ని కాసేపట్లో స్పీకర్ ఖరారు చేయనున్నారు. తమకు నాలుగు గంటల సమయం కావాలని టీడీపీ కోరింది. అయితే, రెండు గంటల సమయం ఇస్తామని, వెసులుబాటును బట్టి సమయాన్ని పెంచే ప్రయత్నం చేస్తామని స్పీకర్ చెప్పినట్టు సమాచారం. మరోవైపు రానున్న సోమవారం నాడు విభజన చట్టంపై రాజ్యసభలో చర్చ జరగనుంది. 

More Telugu News