charan: చరణ్ మూవీలో ఇంట్రవెల్ సీన్ ఒక రేంజ్ లో వుంటుందట!

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • ఆగస్టు 15వ తేదీన ఫస్టులుక్ రిలీజ్ 
  • జనవరి 11వ తేదీన సినిమా విడుదల  

బోయపాటి దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక యాక్షన్ మూవీ రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇంతవరకూ 60 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తరువాత షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేశారట .. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

 సాధారణంగానే బోయపాటి తన సినిమాల్లో ఇంట్రవెల్ బ్యాంగ్స్ అదిరిపోయేలా చూసుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఒక రేంజ్ లో వుంటుందట. అనూహ్యమైనదిగా .. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేదిగా ఇంట్రవెల్ బ్యాంగ్ వుంటుందని అంటున్నారు. ఒక అద్భుతమైన ట్విస్ట్ తో బోయపాటి ఇంట్రవెల్ బ్యాంగ్ ను డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి, ఆగస్టు 15వ తేదీన ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 11వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తారు.           

More Telugu News