Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం ఏఆర్ రెహ్మాన్?

  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 
  • కొనసాగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • త్వరలోనే సెట్స్ పైకి    

అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కథాకథనాల పరంగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

అందువలన ప్రస్తుతం ఏఆర్ రెహ్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
దాదాపు ఆయనను ఒప్పించేలా ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ కీలకం కనుక, అవి కొత్తగా వుండాలని భావిస్తున్నారు. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్ ను తీసుకోనున్నారని చెబుతున్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన నటీనటులను .. సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తికాగానే, ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన చేయాలనుకుంటున్నట్టుగా సమాచారం.  

More Telugu News