Balakrishna: బాలకృష్ణ ఇంటికి వెళ్లి వివరాలు అడిగిన బాలీవుడ్ నటి విద్యాబాలన్!

  • ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్ర పోషిస్తున్న విద్యాబాలన్
  • నిన్నటి నుంచి షూటింగ్ సెట్లో
  • అంతకుముందు బాలకృష్ణ ఇంటికి

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్'లో కీలకమైన బసవతారకం పాత్రను పోషించేందుకు అంగీకరించిన విద్యాబాలన్ షూటింగ్ లో జాయినైంది. నిన్నటి నుంచి ఆమెపై సీన్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. అంతకుముందే హైదరాబాద్ చేరుకున్న ఆమె, బాలయ్యతో పాటు ఎన్టీఆర్ కుటుంబీకులను కలసి బసవతారకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఆమె ఎలా ఉంటారు? మాట్లాడే విధానం, వస్త్రధారణ తదితరాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేసింది. ఈ పాత్రకు సంబంధించి దర్శకుడు క్రిష్ ఆమెకు ముందుగానే అన్ని వివరాలూ చెప్పాడట. అప్పటి నుంచి ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన చిత్రాలను చూస్తున్న ఆమె, వారి గురించి తెలుసుకున్న తరువాతే షూటింగ్ లో కాలు మోపిందట. ఓ పాత్ర ఒప్పుకుంటే దానికి సంబంధించిన హోమ్ వర్క్ ను పూర్తి చేసి సెట్స్ కు వచ్చే విద్యాబాలన్ ఈ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని బాలయ్య ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News