అమితాబ్ వాడిన కారు అమ్మకానికి... కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదట!

18-07-2018 Wed 09:29
  • అమితాబ్ వాడిన రేంజ్ రోవర్ ఎస్యూవీ
  • అమితాబ్ నుంచి మరో వ్యక్తి కొనుగోలు
  • అమ్మకానికి ఉంచిన రెండో యజమాని

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాడిన కారు అది. రేంజ్ రోవర్ సంస్థకు చెందిన లగ్జరీ ఎస్యూవీ. ఇప్పుడది సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో దుమ్ముకొట్టుకుని పోతూ ఉంది. ఆ కారును కొనేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదట. ఈ కారును గతంలో అమితాబ్ నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి, దాన్ని అమ్ముతున్నట్టు ఆన్ లైన్ లో ప్రకటన పెట్టారు.

కండిషన్ లో ఉన్న కారు ధర రూ. 24 లక్షలుగా ఆయన నిర్ణయించారు. ఈ కారు ప్రస్తుతం ముంబైలోని యూజ్డ్ మార్కెట్ లో ఉంది. ఈ కారు పెట్రోల్ తో నడిచేది కావడంతో నిర్వహణ కష్టమన్న అభిప్రాయంతోనే ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పైగా కారు స్పేర్ పార్ట్స్ లభ్యం కావని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.