Hyderabad: పెట్రోలింగ్‌లో పంజగుట్ట పోలీసుల వినూత్న విధానం.. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి!

  • ఇకపై స్ట్రీట్ పెట్రోలింగ్
  • సైకిళ్లపై పోలీసుల గస్తీ
  • మంగళవారం నుంచే అమలు

పెట్రోలింగ్ విధానంలో పంజగుట్ట పోలీసులు వినూత్న పద్ధతిని అవలంబించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి స్ట్రీట్ పెట్రోలింగ్ పేరుతో సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అనుమతితో మంగళవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా పోలీసులు సైకిళ్లపై స్ట్రీట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం నలుగురు పోలీసులు ఈ విధానంలో పెట్రోలింగ్ నిర్వహిస్తారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీందర్, ఎస్ఐ గురునాథ్ తెలిపారు.

సైకిల్‌కు ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్, కమ్యూనికేషన్ అందిండానికి మాన్పాక్ట్, జీపీఎస్ సిస్టమ్, లాఠీ, ఒక వాటర్ బాటిల్ ఉంటాయని వివరించారు. మారుమూల ప్రదేశాల్లోకి కూడా సులభంగా చేరుకోవడం, సేవలు అందించడమే లక్ష్యంగా స్ట్రీట్ పెట్రోలింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.

More Telugu News