comedian: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో.. బుల్లితెర కమెడియన్ హరిబాబు అరెస్ట్!

  • టీవీ సీరియల్స్ లో చిన్నచిన్న పాత్రలు వేసిన హరిబాబు
  • ఎర్రచందనం స్మగ్లింగ్ తో కోట్లు సంపాదించిన వైనం
  • 10 పోలీస్ స్టేషన్లలో 13కు పైగా కేసులు

బుల్లితెరపై కమెడియన్ గా కనిపించి, ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కోట్లు సంపాదించిన హరిబాబును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా హరిబాబు కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో చిరుద్యోగిగా పని చేసిన హరిబాబు, ఒకప్పుడు బతుకుదెరువు కోసం టీవీ సీరియల్స్ లో చిన్నచిన్న పాత్రలు వేశాడు. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఆ సొమ్ముతో ఇటీవలే ఓ సినిమాకు ఫైనాన్స్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో, టాస్క్ ఫోర్స్ సీఐ మధుబాబు నేతృత్వంలో హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13కు పైగా కేసులు ఉన్నాయి. 

More Telugu News