saudi: సౌదీలో వేదికపై సింగర్ ను కౌగిలించుకున్న యువతి.. రెండేళ్ల శిక్ష?

  • రియాద్ లో ఇరాకీ సింగర్ ప్రత్యేక కార్యక్రమం
  • వేదికపై సింగర్ ను కౌగిలించుకున్న బురఖా యువతి
  • పోలీసులకు అప్పజెప్పిన సిబ్బంది..కేసు నమోదు

గల్ఫ్ దేశాల్లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయనే దానికి సౌదీ అరేబియాలో తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. ఇరాకీ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్ కు గల్ఫ్ దేశాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రియాద్ లో రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముహాన్ దిన్ అద్భుతంగా పాడారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన బురఖా ధరించిన ఓ యువతి ఆ పాటలను ఎంతో ఆస్వాదించింది. సంతోషం పట్టలేక వేదికపైకి వెళ్లి సింగర్ ముహాన్ దిన్ ని కౌగిలించుకుంది. దీంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి నుంచి ఆమెను తీసుకెళ్లిపోయారు. పోలీసులకు అప్పగించారు. బలవంతంగా ఆ సింగర్ ను కౌగిలించుకుందనే ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ యువతికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.18 లక్షల జరిమానాను కోర్టు విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News