Rahul Gandhi: రాహుల్ ను విమర్శించి పదవిని పోగొట్టుకున్న బీఎస్పీ కీలక నేత!

  • ప్రధాని పదవికి రాహుల్ పనికిరాడని అన్న జైప్రకాశ్ సింగ్
  • అన్ని పదవుల నుంచి తొలగించిన మాయావతి
  • ఇంకెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలకు ఆదేశం

ప్రధానమంత్రి పదవికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పనికిరాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బహుజన సమాజ్ పార్టీ వైస్ చైర్ పర్సన్, జాతీయ సమన్వయకర్త జైప్రకాశ్ సింగ్ తన పదవిని పోగొట్టుకున్నారు. ఆయనకు బీఎస్పీ అధినేత్రి మాయావతి షాక్ ఇచ్చారు. అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు.

ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాయావతి ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా సింగ్ మాట్లాడారని... అందుకే ఆయనను పదవుల నుంచి తొలగించామని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని తెలిపారు.

 ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరూ చేయవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ పొత్తుల గురించి కూడా ఎవరూ మాట్లాడవద్దని చెప్పారు. పొత్తుల గురించి పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించేంతవరకు దీనిపై ఎవరూ వ్యాఖ్యలు చేయరాదని అన్నారు. బహిరంగసభల్లో మాట్లాడేటప్పుడు... పేపర్ పై రాసుకున్న ప్రసంగాలను చదవడమే మంచిదని, దాని వల్ల పొరపాట్లకు అవకాశం ఉండదని చెప్పారు.

More Telugu News