TNPL: క్యాచ్ అంటే ఇలా ఉండాలి... వీడియో ఇదిగో!

  • ట్రెంట్ బౌల్ట్ ను మరిపించిన మసూద్ షారూఖ్
  • టీఎన్పీఎల్ లో అద్భుత క్యాచ్
  • ఫిదా అయిన డీన్ జోన్స్

రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్ 2018 పోటీల్లో బెస్ట్ క్యాచ్ ఏదంటే, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ పేరే గుర్తుకు వస్తుంది. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టి, లైన్ ను తాకకుండా తన మోచేతులను మడిచాడు గుర్తుందా? రాయల్ చాలెంజర్స్ తో మ్యాచ్ జరుగుతున్న వేళ, హర్ష్ పటేల్ వేసిన బంతిని బౌండరీని దాటించే క్రమంలో విరాట్ కోహ్లీ బాదిన బాల్ ను ఒక్క చేత్తో పట్టుకుని ఔరా అనిపించాడు.

ఇక ఈ తాజా క్యాచ్ అంతకు మించిన అనుభూతిని క్రికెట్ ఫ్యాన్స్ కు అందిస్తోంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా లైకా కోవా కింగ్స్ (ఎల్కేకే)‌, ఐడ్రీమ్‌ కరైకుడి కలై(ఐకేకే) మధ్య మ్యాచ్ జరిగింది. ఐకేకే బ్యాట్స్ మన్ రాజమణి శ్రీనివాసన్ భారీ షాట్ ను ఆడగా, దాన్ని బౌండరీ లైన్ వద్ద ఉన్న ఎల్కేకే ఆటగాడు మసూద్‌ షారుఖ్‌ ఖాన్‌ అద్భుతంగా ఒడిసి పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. ఈ వీడియోను 'టీఎన్పీఎల్' పంచుకోగా, డీన్ జోన్స్ కూడా ఫిదా అయిపోయాడు. ఆ వీడియోను మీరూ చూడండి.

More Telugu News