ntr: కాలేజ్ లో ఎన్టీఆర్ .. పూజా హెగ్డే సన్నివేశాలు!

  • షూటింగు దశలో 'అరవింద సమేత'
  • ఆగస్టు 15వ తేదీన టీజర్ రిలీజ్ 
  • అక్టోబర్ 10వ తేదీన సినిమా విడుదల  

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఒక కాలేజ్ లో జరుగుతోంది. కాలేజ్ నేపథ్యంలో ఎన్టీఆర్ .. పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను నిన్నటి నుంచి చిత్రీకరిస్తున్నారు. లవ్ .. కామెడీ కలగలిసిన సన్నివేశాలతో ఈ ఎపిసోడ్ సరదాగా సాగుతుందని అంటున్నారు.

వచ్చేనెల 3వ తేదీ వరకూ ఇదే కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత చిన్న బ్రేక్ తీసుకుని ఈ సినిమా టీమ్ 'పొల్లాచ్చి' వెళ్లనుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. జగపతిబాబు .. నాగబాబు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. ఆగస్టు 15వ తేదీన ఫస్టు టీజర్ ను .. అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  

More Telugu News