sensex: నష్టాలలో ముగిసిన నేటి స్టాక్ మార్కెట్లు!

  • 218 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 10,937 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
  • 25శాతం పైగా నష్టపోయిన పీసీ జువెలర్స్

ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, రెండో త్రైమాసికంలో చైనా ఎకానమీ కొంతమేర తగ్గిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 218 పాయింట్లు కోల్పోయి 36,324కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 10,937కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇంద్రప్రస్థ గ్యాస్ (3.91%), కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (2.76%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (2.66%), టెక్ మహీంద్రా (2.36%), ఇన్ఫోసిస్ (1.83%).    

టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-25.89%), డెన్ నెట్ వర్క్స్ (-13.45%), డీసీబీ బ్యాంక్ (-9.95%), ఎన్సీసీ (-9.93%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ (-9.85%).      

More Telugu News