virat: నిజమైన ప్రేమను గురించి తెలిస్తేనే ఈ సినిమాకి రండి: 'పరిచయం' దర్శకుడు

  • లక్ష్మీకాంత్ దర్శకుడిగా 'పరిచయం'
  • నాయకా నాయికలుగా విరాట్ .. సిమ్రత్ 
  • ఈ నెల 21వ తేదీన భారీస్థాయి రిలీజ్  

తెలుగు తెరపై ప్రేమకథలు ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే వున్నాయి. కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండాలే గాని కుర్రకారు ప్రేక్షకులు ఈ తరహా సినిమాలకి నీరాజనాలు పడుతుంటారు. భారీవసూళ్లతో .. విజయాలను ముట్టజెబుతుంటారు. అందువల్లనే ప్రేమకథలను తెరకెక్కించడానికి యువ దర్శకులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలా లక్ష్మీకాంత్ దర్శకత్వంలో .. విరాట్ - సిమ్రత్ కౌర్ నాయకా నాయికలుగా 'పరిచయం' సినిమా రూపొందింది.

ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో లక్ష్మీకాంత్ మాట్లాడుతూ .. "ఇంతవరకూ నిజమైన ప్రేమలో పడ్డారా .. ప్రేమించి వుంటేనే నా సినిమాకి రండి .. నిజమైన ప్రేమను గురించి తెలిస్తేనే ఈ సినిమాకి రండి. బైకులపై తిరుగుతూ .. బీచ్ లలో విహరిస్తూ అదే ప్రేమ అని భ్రమపడేవాళ్లు నా సినిమాకి రావద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ల కోసం ఈ సినిమా తీయలేదు" అని చెప్పుకొచ్చారు.  

More Telugu News