Sam Pitroda: ఆలయాలు ఉద్యోగాలు ఇవ్వవు.. తిండి పెట్టవు: శామ్ పిట్రోడా

  • ఆలయాలు ఎప్పుడూ ఉద్యోగాలు కల్పించలేవు
  • సైన్స్ మాత్రమే భవిష్యత్తును నిర్మించగలదు
  • రాజకీయ నాయకుల వల్ల యువత తప్పుదారి

ఆలయ నిర్మాణాల వల్ల భవిష్యత్తు తరాలకు ఒరిగేదేమీ ఉండదని ప్రముఖ సాంకేతిక నిపుణుడు శామ్ పిట్రోడా తేల్చి చెప్పారు. గాంధీనగర్‌లోని కర్ణావతి యూనివర్సిటీ విద్యార్థులతో నిర్వహించిన ‘ఆలయాలు-దేవుడు’పై చర్చా కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మతం వల్ల ఎప్పటికీ ఉద్యోగాల కల్పన జరగదని తేల్చి చెప్పారు. కేవలం సైన్స్ మాత్రమే భవిష్యత్తును నిర్మిస్తుందన్నారు. ఉద్యోగాలకు కూడా రాజకీయ కోణం తోడవుతోందని అన్నారు.

‘‘ఆలయాలు, మతం, దేవుడు, కులం వంటి వాటిపై జరుగుతున్న చర్చలు వింటున్నప్పుడు చాలా బాధనిపిస్తుంటుంది. దేశాన్ని తలచుకుంటే ఆవేదన వస్తుంది. రేపటి రోజున ఆలయాలు ఉద్యోగాలను సృష్టించలేవు. ఒక్క సైన్స్ మాత్రమే ఆ పని చేయగలదు’’ అని పిట్రోడా పేర్కొన్నారు. ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారూ అంటే.. దానికి తప్పకుండా రాజకీయ కోణం తోడై ఉంటుందని పేర్కొన్నారు. యువతను ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆయన ముఖ్యంగా రాజకీయ నాయకులే అందుకు కారణమని ఆరోపించారు. పనికిరాని మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని, ఫలితంగా యువత తప్పుడు దారిలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News