Kumaraswamy: సంకీర్ణమంటే అంతేమరి... ఏడ్చిన కుమారస్వామికి కాంగ్రెస్ ఓదార్పు!

  • తనకిప్పుడు విషం మింగుతున్నట్టు ఉందని కన్నీరు పెట్టుకున్న కుమారస్వామి
  • ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి
  • ప్రజల ముందు కన్నీరు కారిస్తే తప్పుడు సంకేతాలు
  • కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే

కన్నడనాట సంకీర్ణ ప్రభుత్వాన్ని తాను ఎంతో కష్టంతో నడుపుతూ ఉన్నానని, తనకిప్పుడు విషం మింగుతున్నట్టు ఉందని కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓదార్పు వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కుమారస్వామి ధైర్యంగా ఉండాలని, సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు.

 "ఓ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఎప్పుడూ కష్టమే. ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఎదురవుతుంది. సమస్యను సెక్యులర్ పార్టీలకు మద్దతిస్తున్న ప్రజల ముందు పెట్టడం మంచి పద్ధతి కాదు. అది తప్పుడు సంకేతాలను పంపిస్తుంది. ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొనేందుకు కుమారస్వామి ధైర్యంగా ఉండాలి. ప్రజల కోరికలను నెరవేర్చాలి" అని వ్యాఖ్యానించారు. శనివారం నాడు జేడీ(ఎస్) నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన కుమారస్వామి కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News