Russia: ఏడాది పాటు వీసా ఫ్రీ ఎంట్రీ: రష్యా వెళ్లిన ఫుట్ బాల్ అభిమానులకు బంపరాఫర్ ఇచ్చిన పుతిన్!

  • 'ఫ్యాన్ ఐడీ' ఉంటే వీసా ఉచితం
  • ఈ సంవత్సరం చివరి వరకూ వచ్చిపోవచ్చు
  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

దాదాపు నెలన్నర పాటు ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులను అలరించిన ఫిఫా వరల్డ్ కప్-2018 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన పోరులో ఫ్రాన్స్ జట్టు క్రొయేషియాపై 4-2 తేడాతో విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. రష్యాలో ఫుట్ బాల్ పోటీలు విజయవంతం కావడంతో ఎంతో ఆనందంగా ఉన్న దేశాధ్యక్షుడు పుతిన్, అభిమానులకు బంపరాఫర్ ఇచ్చారు. ఫుట్ బాల్ చూసేందుకు 'ఫ్యాన్ ఐడీ' కార్డులతో తమ దేశానికి వచ్చిన విదేశీయులు, ఈ సంవత్సరమంతా ఎటువంటి వీసా ఫీజు చెల్లించకుండా ఎన్నిసార్లయినా రష్యా వచ్చి వెళ్లవచ్చని ప్రకటించారు.

ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు టికెట్ కొనుగోలు చేసిన విదేశీయులు, దేశంలో దిగగానే ఈ 'ఫ్యాన్ ఐడీ' ఇస్తారు. ఈ ఐడీలు మామూలుగా అయితే, ఈ నెల 25తో ఎక్స్ పైర్ అయిపోతాయి. ఇప్పుడీ ఫ్యాన్ ఐడీ చూపించి, సంవత్సరం చివరి వరకూ ఎన్నిసార్లయినా పర్యటించవచ్చని తెలిపారు. రష్యాకు, పశ్చిమ దేశాలకు మధ్య ద్వైపాక్షిక ఉద్రిక్తతలు నెలకొని ఉన్నప్పటికీ, పలు దేశాధినేతలు మ్యాచ్ లు చూసేందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News