Egypt: వెండి ముసుగు, బంగారపు పూతతో మమ్మీ... ఈజిప్టును ఏలిన చక్రవర్తి భార్యగా అనుమానం!

  • సఖ్కార నెక్రోపోలిస్ ప్రాంతంలో మమ్మీలు
  • ఒకే చోట 35 మమ్మీల వెలికితీత
  • బంగారు పూతతో మమ్మీ చరిత్రలో రెండోది

ఈజిప్టులో ఓ చారిత్రక అద్భుతం వెలుగులోకి వచ్చింది. కైరోకు దక్షిణ ప్రాంతంలో ఉన్న సఖ్కార నెక్రోపోలిస్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు, పరిశోధనలు సాగిస్తుండగా, క్రీస్తు పూర్వం 664-404 ప్రాంతంలో పాతిపెట్టిన 35 మమ్మీలు ఒకే ప్రాంతంలో లభ్యమయ్యాయి. వీటిల్లో ఓ మమ్మీకి వెండి ముసుగు, దానిపై బంగారం పూత ఉండటం అద్భుతమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

దేశ చరిత్రలో ఇలా వెండి ముసుగు, బంగారపు పూతతో లభించిన మమ్మీ ఇది రెండోదని అంటున్నారు. భూమి ఉపరితలానికి 30 మీటర్ల దిగువన ఖననం చేసిన ఈ మమ్మీ, దేశాన్ని ఏలిన చక్రవర్తి భార్యది అయ్యుండవచ్చని భావిస్తుండగా, దీన్ని పరిశీలిస్తే, అప్పట్లో వాడిన రసాయనాల గురించి సరికొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

More Telugu News