ant man and the wasp: ఒక్క రోజులోనే 7 కోట్లు కొల్లగొట్టేసిన హాలీవుడ్ మూవీ

  • ఉత్కంఠను పెంచే కథాకథనాలు 
  • అందుకు తగిన గ్రాఫిక్స్ 
  • అన్ని భాషల్లోను భారీ వసూళ్లు  

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో .. భారీ తారాగణంతో హాలీవుడ్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ సినిమాల్లోని ఉత్కంఠను పెంచే కంటెంట్ .. అందుకు తగిన గ్రాఫిక్స్ వీక్షకులను మరోలోకంలోకి తీసుకెళుతున్నాయి. ఈ కారణంగానే హాలీవుడ్ సినిమాలకి ఇక్కడ ఆదరణ పెరుగుతోంది.

'అవెంజర్స్' .. 'ఇన్ఫినిటీ వార్' .. 'డెడ్ పూల్ 2' .. 'జురాసిక్ వరల్డ్' వంటి సినిమాలు ఇక్కడ సాధించిన వసూళ్లే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'చీమ మనిషి'కి సంబంధించిన కథాకథనాలతో కొనసాగే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని తొలిరోజున ఈ సినిమా 7.05 కోట్లను రాబట్టినట్టు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చెప్పారు.    

More Telugu News