ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు!

14-07-2018 Sat 16:42
  • నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి పట్నంలో కలకలం
  • అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని మనస్తాపం
  • కిందికి దించేందుకు ప్రయత్నిస్తోన్న స్థానికులు

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదంటూ ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి దూకేస్తానని బెదిరిస్తోన్న ఘటన నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి పట్నంలో కలకలం రేపుతోంది. తనకు, ఆ అమ్మాయికి పెళ్లి జరిపించాలని, లేదంటే అక్కడి నుంచి దూకేస్తానని ఆ యువకుడు బెదిరిస్తున్నాడు.

 అతడిని కిందికి దించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాగా, ఆ యువకుడు గతంలోనూ ఇలాగే ఓసారి సెల్ టవర్ ఎక్కి ఇలాగే డిమాండ్‌ చేశాడని స్థానికులు తెలిపారు.