Nirav Modi: నీరవ్‌ మోదీకి చెందిన దుకాణాల్లో నగలు కొన్న 50 మందిపై దర్యాప్తు

  • పన్ను రిటర్నులను మళ్లీ పరిశీలిస్తాం
  • నీరవ్‌ దుకాణాల నుంచి పలు పత్రాలను సేకరించాం
  • కొందరు నగదు రూపంలో కొంత డబ్బు చెల్లించారు

విదేశాల్లో తలదాచుకుంటోన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన దుకాణాల నుంచి గతంలో ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేసిన సుమారు 50 మందిపై దర్యాప్తు జరిపేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. వారి పన్ను రిటర్నులను మళ్లీ పరిశీలించాలని నిర్ణయించారు. ఆయన దుకాణాల్లో ఆభరణాల కొనుగోలుకు సంబంధించి ఆదాయ, రిటర్నుల వివరాలు తెలియజేయని వారికి నోటీసులు కూడా పంపుతామని అధికారులు తెలిపారు.

తాము ఇప్పటికే నీరవ్‌ మోదీ దుకాణాల నుంచి పలు పత్రాలను సేకరించామని తెలిపారు. వాటిని పరిశీలించి చూడగా కొనుగోలు చేసిన వారు కొంత డబ్బును నగదు రహిత లావాదేవీల ద్వారా జరిపి మిగతాది నగదు రూపంలో చెల్లించారని తాము గుర్తించినట్లు చెప్పారు. పన్ను నోటీసుల్లో చాలా మంది నగదు చెల్లింపుల వివరాలు తెలపలేదని అన్నారు. కాగా, పంజాబ్‌ నేషనల్ బ్యాంకులో మోసానికి పాల్పడిన నీరవ్‌ మోదీపై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.          

More Telugu News