TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 6 రోజుల పాటు స్వామివారి దర్శనం నిలిపివేత

  • ఆగస్టు 11 నుంచి 16 వరకు దర్శనాలు నిలిపివేత
  • ఘాట్ రోడ్డు, నడకదారి కూడా బంద్
  • మహా సంప్రోక్షణం సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయ మహా సంప్రోక్షణం సందర్భంగా 6 రోజుల పాటు స్వామివారి సందర్శనను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. వచ్చే నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి దర్శనాన్ని పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇదే సమయంలో ఘాట్ రోడ్డు, నడకదారిని కూడా బంద్ చేయనున్నారు. ఆగస్టు 17 తర్వాత భక్తులను యథావిధిగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. 11వ తేదీన ఈ కార్యక్రమానికి అంకురార్పణ ఉంటుంది.

More Telugu News