jyothika: తెలుగు తెరకి 'ఝాన్సీ' .. ప్రధానపాత్రలో జ్యోతిక

  • జ్యోతిక ప్రధాన పాత్రగా 'నాచ్చియార్'
  • తమిళంలో భారీ విజయం 
  • ప్రముఖుల నుంచి ప్రశంసలు 

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకున్న జ్యోతిక, ప్రస్తుతం తన వయసుకి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నారు. అలా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె నుంచి వచ్చిన 'నాచ్చియార్' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. బాలా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమాలో పోలీస్ అధికారిణిగా జ్యోతిక ప్రదర్శించిన నటనకు అభిమానుల నుంచి అభినందనలు దక్కాయి. అక్కడి అగ్రనటీనటులు సైతం ఆమె నటన పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జ్యోతిక పోషించినది పవర్ఫుల్ రోల్ కావడం వలన 'ఝాన్సీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. 

More Telugu News