Devadas: అలనాటి ప్రముఖ సినీ నేపథ్య గాయని రాణి కన్నుమూత!

  • గత రాత్రి కుమార్తె ఇంట్లో కన్నుమూత
  • పదేళ్ల వయసులోనే ‘దేవదాసు’లో పాట
  • ఆమె పాటకు ముగ్ధుడైన అప్పటి రాష్ట్రపతి రాధాకృష్ణన్

టాలీవుడ్ అలనాటి నేపథ్య గాయని కె.రాణి (75) గత రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. కళ్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంటిలో ఉంటున్న రాణి శుక్రవారం రాత్రి 9:10 గంటలకు తుదిశ్వాస విడిచారు.

 9వ యేటే సినీ నేపథ్య గాయనిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన ఆమె1951లో గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమె పలు భాషల్లో 500 పాటలు పాడారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ సినిమాలో ఆమె పాడిన ‘అంతా భ్రాంతియేనా..’ పాట ఇప్పటికీ ప్రముఖంగానే వినిపిస్తుంటుంది. పదేళ్ల వయసులోనే ఆమె ఆ పాట పాడడం విశేషం.

తన గానామృతంతో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఓలలాడించారు. శ్రీలంక జాతీయ గీతాన్ని ఆలపించిన ఘనతను కూడా ఆమె దక్కించుకున్నారు. ‘ఇన్నిసాయ్ రాణి’ అని అప్పటి కాంగ్రెస్ నేత కె.కామరాజ్ ఆమెను పిలిచేవారు.

More Telugu News