Puri Jagannadh: హైదరాబాద్‌లో నేడు జగన్నాథ రథయాత్ర.. నగరం నిండా ట్రాఫిక్ ఆంక్షలు

  • నగరంలోని 14 చోట్ల నుంచి యాత్ర ప్రారంభం
  • వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచన
  • భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు

పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా నేడు నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 14 చోట్ల నుంచి రథయాత్రలు ప్రారంభం కానున్నాయి. భక్తులు అశేషంగా పాల్గొనే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అదనపు కమిషనర్‌(ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ తెలిపారు.

సికింద్రాబాద్, బంజారాహిల్స్, సీతారాంబాగ్‌, షాహినాయత్‌గంజ్‌ జగన్నాథ్‌ మఠం, ఎన్‌టీఆర్‌ స్టేడియం, సుల్తాన్‌బజార్‌ కందస్వామి లేన్‌లోని జగన్నాథస్వామి మఠం, కోఠి విమెన్స్‌ కాలేజీ పక్కనున్న హనుమాన్‌ ఆలయం, అఫ్జల్‌గంజ్‌, అశోక్‌బజార్‌ జగన్నాథ ఆలయం, చాంద్రాయణగుట్ట జగన్నాథస్వామి ఆలయం, శాలిబండ ఆలయం, లాల్‌దర్వాజ జగన్నాథస్వామి ఆలయం, షక్కర్‌గంజ్‌, శాలిబండ ఊంటోకి మైదాన్‌ జగన్నాథ స్వామి ఆలయం, గోపాల్‌ జగన్నాథ స్వామి ఆలయాల నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని అదనపు సీపీ తెలిపారు.

More Telugu News